హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ దవాఖానలు, టీ-వర్స్ భాగస్వామ్యంతో ఎండోసోపీ టెక్నీషియన్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం, మెడికల్ కోడింగ్ అండ్ సాఫ్ట్ సిల్స్ ప్రోగ్రాం కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. మొదటి విడతలో ఆరు కోర్సులను ప్రవేశపెట్టగా, తాజాగా మరో మూడు కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్సుల వివరాలకు www.yisu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్‌లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న యోగితారాణాను విద్యాశాఖ కార్యదర్శిగా, నీటిపారుదల, గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర మోహన్‌ను రవాణాశాఖ కమిషనర్‌గా నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్‌కు నీటిపారుదల, గనులశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.