ఎంపీసీ చదివినా డాక్టర్ కావొచ్చు!
ఎంపీసీ చదివినా డాక్టర్ కావొచ్చు.. ఆశ్చర్యంగా అనిపించినా నేషనల్ మెడికల్ క మిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయం మేరకు ఇది సాకారం కానున్నది. ఇంటర్లో ఎంపీసీ తీసుకొన్నామని.. మెడిసిన్ చదివి డాక్టర్ అయితే బాగుండు అని చాలామంది బాధపడుతుంటారు.
- నీట్ యూజీ దరఖాస్తుకు అవకాశం కల్పించనున్న ఎన్ఎంసీ
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎంపీసీ చదివినా డాక్టర్ కావొచ్చు.. ఆశ్చర్యంగా అనిపించినా నేషనల్ మెడికల్ క మిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయం మేరకు ఇది సాకారం కానున్నది. ఇంటర్లో ఎంపీసీ తీసుకొన్నామని.. మెడిసిన్ చదివి డాక్టర్ అయితే బాగుండు అని చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు ఎన్ఎంసీ తీపికబురు అందించింది.
ఎంపీసీ చదివినా నీట్ యూజీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివినవారికే నీట్ రాసే అవకాశం ఉండే ది. తర్వాత, బయోటెక్నాలజీ చదివిన వారికీ అవకాశం కల్పించారు. తాజాగా మ్యాథ్స్ చదివిన విద్యార్థులకూ అనుమతి ఇచ్చింది. అయి తే, వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని, ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకొని, ఉత్తీర్ణులు కావాలని నిబంధన విధించింది. వీరు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చేసేందుకు అర్హులని స్పష్టంచేసింది. వచ్చే నీట్ యూజీ నోటిఫికేషన్ నుంచే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Doctor
- MPC
- NEET UG Application
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

