హనుమకొండ చౌరస్తా, మే 31: తాత్కాలిక ఉద్యమకారుల ఎంపిక కమిటీలో అసలైన ఉద్యమకారులను గుర్తించలేదని, అంతా తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఏదునూరి రాజమౌళి, ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిశెట్టి క్రాంతికుమార్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని నిలదీశారు. శుక్రవారం హనుమకొండ నయీంనగర్‌లో జరిగిన సమావేశంలో వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
మైకులు పట్టుకుని వేదికలపై మాట్లాడేవారే ఉన్నారని, నిజమైన ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారని వారు ప్రశ్నించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తెలంగాణ ఉద్యమంలో లేరని, పిలిస్తే వచ్చి మాట్లాడేవాడని,అలాంటి వ్యక్తితో కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తిస్తారా? నిలదీశా రు. స్పందించిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మీడియాలో కనిపించాలని ఇలా చేయడం సరి కాదన్నారు. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయకుండా కమిటీ గుర్తిస్తుందని, ఒకవేళ పొరపాటున గుర్తించలేకపోతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు.