హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైసీపీకి చెందిన రైతులకు నో డ్యూస్ ఇవ్వటం లేదని ఆరోపిస్తూ రైతులతోపాటు అవినాశ్ రెడ్డి వేముల తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడ టీడీపీకి చెందిన రైతులు ఉండటంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు అకడి నుంచి పులివెందులకు తరలించారు.