హైదరాబాద్, జూన్ 4 (నమస్తేతెలంగాణ): భూఆక్రమణ కేసును ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసుస్టేషన్లో ఆయనపై భూ ఆక్రమణ కేసు నమోదైంది.
వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ కోర్టు ఈ పిటిషన్పై విచారణ జరుపుతుందని జస్టిస్ సుద్దాల చలపతిరావు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు కుట్ర చేశారంటూ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.