అమరావతి : మతి స్థిమితం కోల్పోయిన వైసీపీ( YCP ) నాయకులు మావిగన్ ( Mavigan ) పేరుతో కొత్తనాటకం ఆడుతున్నారని ఏసీ సీఎం చంద్రబాబు( Chandrababu ) ఆరోపించారు. తన జీవిత చర్రితలో ఇలాంటి మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం చూడలేదని పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను , విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం వీడిపోయిన తరువాత రాజధాని అమరావతిని వైసీపీతో సహ అందరూ అంగీకరించారని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మూడు రాజధానులంటూ అయోమయాన్ని సృష్టించాయని ఆరోపించారు. తిరిగి అధికారం కోలోయ్యాక కేంద్రం అమరావతిపై చట్టం చేసిన తరువాత వైసీపీ మావిగన్ పేరుతో కొత్తనాటకం ప్రారంభించారని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు.
విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలతో రాయలసీమను రతనాల సీమగా చేసి చూపిస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో మోసపూరిత శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. విశాఖ మాత్రమే కాదని, రాయల సీమ కూడా ఉక్కుకు కేంద్రమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.