ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి
ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతు న్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు.
- ఢిల్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధర్నా
- దాడులు, హింసాత్మక ఘటనలపై ఆగ్రహం
- ఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన (ఉద్ధవ్) పార్టీల మద్దతు
- కేంద్ర హోంశాఖ విచారణకు డిమాండ్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతు న్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, ఆ పార్టీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్, ప్రియాంక చతుర్వేది, శివసేన (ఉద్ధవ్ వర్గం) లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ రాహుల్ షేవాలే, ఎంపీ సంజయ్‌రౌత్, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై తదితరులు స్వయంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తున్నదని మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని,వందల ఇండ్ల ను ధ్వంసం చేశారని చెప్పారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ? అని ప్రశ్నించారు.
యూపీలోనూ ఇదే పరిస్థితి : అఖిలేశ్ యాదవ్
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులున్నాయని ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ చెప్పారు. ప్రతీకార రాజకీయాలు మంచిదికాదని హితవు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయం లో జగన్‌కు మద్దతిస్తామని స్పష్టంచేశారు. సంజయ్‌రౌత్ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన దాడులపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ర్టానికి పంపాలని డిమాండ్ చేశారు. రాహుల్ షేవాలే మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితి అత్యంత విచారకరమని, మణిపూర్ లాంటి పరిస్థితులు ఉన్నాయని, కేంద్ర హోంశాఖ చూస్తూ ఊరుకోవద్దని కోరారు. తంబిదురై మాట్లాడుతూ.. రాజకీయ దాడులు మంచిదికాదని హితవు చెప్పారు. తమిళనాడులోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నామని, దాదాపు 590 మందిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

