ఖమ్మం, సెప్టెంబర్ 3: ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం వచ్చిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీమంత్రులపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీమూకల్లా వచ్చి దాడులకు దిగారు. ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుడికాలు విరగటంతో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు జరిగిన ఘటనను పూసగుచ్చినట్టు వివరించారు.
‘కాంగ్రెస్ గూండాలు కర్రలు, రాళ్లు ఇనుపరాడ్లతో దాడులకు దిగారు. ముందు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాలపై దాడులకు దిగారు. ఒకడు పెద్ద గ్రానైట్ రాయి, కర్రతో హరీశ్ అన్నపై దాడికి పాల్పడేందుకు యత్నిస్తున్న క్రమంలో అడ్డుకున్నా. మరో ముగ్గురు వచ్చి నాపై దాడిచేసి కొట్టారు. నా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని నన్ను వెంటనే దవాఖానకు తరలించారు. వైద్యులు విరిగిన కాలికి ఆపరేషన్ చేయాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నాం’ అని చెప్పారు.