పోస్టర్ ఆవిష్కరించిన యాదవ మహాసభ నేతలు
హైదరాబాద్, మార్చి 27: యాదవులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వాటా కల్పించాలన్న డిమాండ్‌తో మే 3న హైదరాబాద్‌లో యాదవుల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్టు యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ చలకాని వెంకట్ తెలిపారు. నాగోలులోని శుభం కన్వెన్షన్‌లో సభ జరుగుతుందని చెప్పారు. ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, విశ్రాంత న్యాయమూర్తి మన్మోహన్ యాదవ్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సభకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ తదితర ప్రతినిధులు హాజరవుతారని వెంకట్ తెలిపారు.