యాదగిరిగుట్ట , యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆదాయం(Income) భారీగా పెరిగింది. ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా గడిచిన 19 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు, వివిధ సేవల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అధికారులు మంగళవారం లెక్కించారు.
లెక్కింపులో ఆలయానికి రూ.,కోటి 86 లక్షలు ఆదాయం వచ్చిందని యాదాద్రి దేవస్థానము కార్యనిర్వహణాధికారి(Temple EO) వెల్లడించారు.159 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 300 గ్రాముల మిశ్రమవెండి స్వామివారికి కానుకల రూపేణా సమకూరిందని వెల్లడించారు.
1249 అమెరికా డాలర్లు, 65 యూఏఈ దిరామ్స్, రియల్స్ 22, 150 ఆస్ట్రేలియా డాలర్స్, 5కెనడా డాలర్స్, ఒక ఒమన్ కరెన్సీచ బైసాకతార్ 2, యూరోప్ 30,థాయిలాండ్ 60 ఇండోనేషియా 50, 000,కువైట్ నుంచి 1 1/2,బహరైన్ నుంచి 1/2 దిరామ్స్ సమకూరాయని వివరించారు.