యాదగిరిగుట్ట, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Sri Laxmi narasimha swamy)కి భక్తుల తాకిడి నానాటికి పెరుగుతుంది. దీంతో బాటు స్వామివారికి విరాళాలు, కానుకల బహుకరణకు భక్తులు తమ శక్తి కొలది సమర్పించుకుంటున్నారు.
Gold Cap1
హైదరాబాద్ లోని చంపాపేట్ కు చెందిన మాచమోని ప్రకాశ్ ముదిరాజ్ అనే భక్తుడు సుమారు రూ. 30 లక్షల విలువచేసే అర కేజీ బంగారం(Gold), అరకేజీ వెండి(Silver)తో మూడు కిరీటాలు(Crowns), ప్లేట్లు స్వామి వారికి బహూకరించారు. ఇందుకు సంబంధించిన కిరీటాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. ఈ సందర్భంగా మాచమోని ప్రకాశ్ కుటుంబ సభ్యులను అర్చకులు ఆశీర్వదించారు.