Home
Telangana
Yadagirigutta Main Temple Priests Performed Archanas With Golden Flowers To The Golden Idols
సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చన
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
యాదాద్రి, నవంబర్ 2: యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేశారు.
మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతా లు, కార్తిక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.20,84,165 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

