యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం కాముని దహనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండకింద పాత గోశాల వద్ద కట్టెలను పేర్చి ఆలయ పురోహితుడు నాగరాజు శర్మ నేతృత్వంలో దహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పురోహితుడు కాముని దహనం విశిష్టతను వివరించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
-యాదగిరిగుట్ట