అంధకారంలో ఆశాదీపం
తెలంగాణ వరప్రదాయిని, కరువుకాలంలో కల్పతరువులాంటి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకున్నది. ఈ ప్లాంట్‌లోని ఐదో యూనిట్ సింక్రనైజేషన్ బుధవారం పూర్తయ్యింది. 800 మెగావాట్ల యూనిట్ -5ను గ్రిడ్‌తో అనుసంధానించారు. బుధవారం ఉదయం 11:06 గంటల సమయంలో యూనిట్‌ను సింక్రనైజేషన్ చేశారు. సింక్రనైజేషన్ సమయంలో 155.1 మెగావాట్ల విద్యుత్తును ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసింది.
- కేసీఆర్ కలల ప్రాజెక్టు వైటీపీఎస్ ఐదో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తి
- గ్రిడ్‌తో అనుసంధానమైన 800 మె.వా. యూనిట్
- నెల రోజుల్లోపే పూర్తిస్థాయి ఉత్పత్తికి సన్నాహాలు
- మార్కెట్‌తో పోల్చితే యూనిట్‌కు రూ. 3.34 ఆదా
- పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు కీలక భరోసా
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరప్రదాయిని, కరువుకాలంలో కల్పతరువులాంటి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకున్నది. ఈ ప్లాంట్‌లోని ఐదో యూనిట్ సింక్రనైజేషన్ బుధవారం పూర్తయ్యింది. 800 మెగావాట్ల యూనిట్ -5ను గ్రిడ్‌తో అనుసంధానించారు. బుధవారం ఉదయం 11:06 గంటల సమయంలో యూనిట్‌ను సింక్రనైజేషన్ చేశారు. సింక్రనైజేషన్ సమయంలో 155.1 మెగావాట్ల విద్యుత్తును ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసింది.
ఇక నుంచి క్రమంగా ఉత్పత్తిని పెంచుతారు. పలు రకాల ట్రయల్స్ నిర్వహిస్తారు. దాదాపు నెల రోజులపాటు ట్రయల్స్ కొనసాగుతాయి. ఆ తర్వాత ప్లాంట్‌ను 72 గంటలపాటు పూర్తి లోడ్‌తో నడుపుతారు. దీనినే కమిషనింగ్ ఆఫ్ డేట్(సీవోడీ)గా పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఐదో యూనిట్ అందుబాటులోకి వచ్చినట్టే. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు ఉన్న ఈ ప్లాంట్‌లో ఇప్పటికే నాలుగు వినియోగంలో ఉన్నాయి. తాజాగా యూనిట్ -5 సింక్రనైజేషన్ ప్రక్రియను టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ ఇంజినీర్లు పూర్తిచేశారు. మరో నెల రోజుల్లోపే ఈ యూనిట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని జెన్కో ఇంజినీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్. ఇది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద థర్మల్ ప్రాజెక్ట్. కరెంట్ కోతల నుంచి రాష్ర్టాన్ని బయటపడేయడం, విద్యుత్తు కోసం పక్క రాష్ర్టాల వైపు తొంగిచూసే పరిస్థితులు ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. రాష్ర్టాన్ని మిగులు విద్యుత్తు దిశలో నడిపేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కరెంట్ కోసం రాష్ట్రం విలవిల్లాడుతున్న ఈ తరుణంలో యాదాద్రి ప్లాంటే ఆశాదీపమయ్యింది. ఈ ప్లాంట్‌లోని నాలుగు యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. సగటున రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందిస్తున్నాయి. కరెంట్ కష్టాల నుంచి బయటపడేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ఇప్పుడు 26వేల మెగావాట్లకు చేరింది.
పది రూపాయలతో పోల్చితే చౌకే..
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం డేంజర్‌బెల్స్ మోగిస్తున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు విద్యుత్తు సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే వినియోగమవుతున్నది. దీంట్లో 120 -140 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సీజీఎస్, పర్చేజెస్ ద్వారా రాష్ట్రం కొనుగోలు చేస్తున్నది. నిరుటితో పోల్చితే విద్యుత్తు కొనుగోళ్లు 121 శాతం పెరిగాయి. 2025 సెప్టెంబర్‌లో 900 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,989 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. నిరుడు సగటున ఒక యూనిట్ విద్యుత్తును రూ.2.46కు కొంటే.. ఈ ఏడాది సగటు ధర రూ. 5.15గా ఉంది.
విద్యుత్తు కొనుగోళ్ల వ్యయం కూడా భారీగానే పెరిగింది. 2025 సెప్టెంబర్‌లో రూ. 222 కోట్లు పెట్టి విద్యుత్తు కొనుగోళ్లు చేయగా, ఈ ఏడాది ఒక్క నెలలో ఈ వ్యయం రూ.1,024 కోట్లకు(362శాతం) చేరింది. జూలై – సెప్టెంబర్ మధ్యకాలంలో విద్యుత్తు సంస్థలు రూ. 2,387 కోట్లు పెట్టి విద్యుత్తు కొనుగోళ్లు జరిపాయి. నిరుడు రూ.1,126 కోట్లు ఖర్చుకాగా, ఈ ఏడాది రూ. 1,261కోట్లు అదనంగా ఖర్చుచేయాల్సి వచ్చింది. రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కొన్నిసార్లు గరిష్ఠంగా యూనిట్ రూ.10 చొప్పున కొనుగోలు చేసి విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. అయితే యాదాద్రి యూనిట్ వ్యయం రూ. 6.66 మాత్రమే. అంటే బయటి కొనుగోళ్లతో పోల్చితే రూ.3.34 తక్కువన్న మాట. అయినా సర్కార్ పెద్దలు పదేపదే వైటీపీఎస్పై నోరుపారేసుకుంటున్నారు.
వైటీపీఎస్ యూనిట్ల కమిషనింగ్ ఇలా..
యూనిట్ : సీవోడీ అయిన తేదీ
యూనిట్ -1: 12-7-2025
యూనిట్ -2 : 25-1-2025
యూనిట్ -3 : 21- 5-2026
యూనిట్ -4 : 08-1-2026
యూనిట్ -5 : సీవోడీ కావాల్సి ఉన్నది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

