బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:37

అద్భుత శిల్పకళా క్షేత్రంగా యాదాద్రి

అద్భుత శిల్పకళా క్షేత్రంగా యాదాద్రి

  • మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి, ఎంపీ కేకే

ఆలేరు: యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత శిల్పకళా దేవతామూర్తుల క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్నదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ అన్నారు. బుధవారం వారు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రంలో జరిగిన లక్ష్మీ సుదర్శన చండీహోమంలో పాల్గొన్నారు. వీరి వెంట ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ఉన్నారు.