స్కూల్ బస్సు టైర్ కింద నలిగిన బాలుడు
స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా భవనగిరి మండలం వడపర్తిలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తికి చెందిన సేవర్తి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు.
- యాదాద్రి జిల్లాలో ఘటన
భువనగిరి కలెక్టరేట్, జూన్ 27 : స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా భవనగిరి మండలం వడపర్తిలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తికి చెందిన సేవర్తి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మోక్షిత్ గ్రామంలోని శ్రీరామానుజ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం మోక్షిత్ పాఠశాల నుంచి స్కూల్ బస్సులో ఇంటికి రాగా.. తల్లి బస్సు వద్దకు వెళ్లింది.
అన్నను చూసిన తమ్ముడు రెండున్నరేండ్ల నిషాంత్ తల్లి వెంట బస్సు వద్దకు వచ్చాడు. డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి ముందుకు కదులుతుండగా ప్రమాదవశాత్తు నిషాంత్ బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందాడు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌హెచ్‌వో అనిల్‌కుమార్ తెలిపారు. డ్రైవర్ నిరక్ష్యంతోనే తన కుమారుడు మృతిచెందాడని శ్రీనివాస్ ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

