హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ‘హేట్ స్పీచ్’ బిల్లు తీసుకొచ్చారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ జపం చేస్తుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజల హక్కుల హననానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే వేల మంది బీఆర్ఎస్ సోషల్‌మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారని, సర్కార్ పెట్టిన కేసులను కోర్టులు కొట్టివేస్తూ ప్రభుత్వ పెద్దలకు మొట్టికాయలు వేస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజాపాలన తీసుకొస్తానని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఆంక్షల పాలన తెచ్చారని దుయ్యబట్టారు.