చంపాపేట, ఏప్రిల్ 10: స్టాంపులు రిజిస్ట్రేషన్ల విభాగంలో మార్పుల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి డాక్యుమెంట్ రైటర్స్‌కు ఉపాధిని లేకుండా చేస్తున్నారని, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్రైటర్స్ డిమాండ్ చేశారు. గురువారం చంపాపేటలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోగా, వారు ఎంచుకున్న ఉపాధిని దెబ్బతిస్తున్నదని మండిపడ్డారు.
అనంతరం డీఐజీ ట్వింకిల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ సయ్యద్ నజీరుద్దీన్, డీ మహేశ్, జే మదన్మోహన్, కే నర్సింహ, ఎన్ వినయ్‌కుమార్‌గౌడ్, ఏ శేఖర్, ఏ రమేశ్, భాస్కర్‌రెడ్డి, కే లక్ష్మణ్, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 15నిమిషాల్లోనే చేయించుకోవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం అధికారిణి ట్వింకిల్ తెలిపారు. గురువారం ఆమె డీఆర్వో సంతోశ్‌రెడ్డితో కలిసి చంపాపేటలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ల కోసం తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, చంపాపేట, మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో చంపాపేట సబ్ రిజిస్ట్రార్ ఎంవై రెహమాన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.