హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : మన తొలివెలుగు యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ జర్నలిస్టుగా చెప్పుకొంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్న రఘుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. గత నెల 23న మీడియా ముసుగులో రఘు తన అనుచరులతో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డాడు.
అతను అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో ‘మార్వాడీలను సజీవ దహనం చేస్తా’నంటూ వార్నింగ్ ఇవ్వడమే గాక బాధితులు డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కథనాలతో మరింత భయపెట్టాడు. ఈ క్రమంలో రఘుపై బాధితుడు వికాస్ అగర్వాల్ రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రఘుపై గాంధీనగర్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు. నేడు, రేపు ఎన్.వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టనున్నది.