హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక-సారలమ్మ జాతరలో చిన్నపిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల భద్రత కోసం ‘చి్రల్డన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (సీటీఎంఎస్) రిస్ట్ బ్యాండ్లను ఉపయోగించనున్నారు. వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ వినూత్న క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లు, సంబంధిత పోస్టర్లను డీజీపీ శి వధర్రెడ్డి శనివారం తన కార్యాలయం లో ఆవిష్కరించారు.
జాతర రద్దీలో త ప్పిపోయే చిన్నారులు, వృద్ధులు, ది వ్యాంగుల ఆచూకీని వెంటనే గుర్తించి, కుటుంబసభ్యుల చెంతకు చేర్చేందుకు ఈ రిస్ట్ బ్యాండ్లు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో మహా కుంభమేళా లాంటి భారీ ఉత్సవాల్లో కూడా వీటిని వి నియోగించుకోవచ్చని డీజీపీ తెలిపారు. ఎస్ఐబీ ఐజీబీ సుమతి 40 రోజులుపైగా కష్టపడి సీటీఎంఎస్ను సిద్ధం చేశారని డీజీపీ అభినందించారు.