
యాదాద్రి, డిసెంబర్13: యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం పనులు మరింత వేగవంతం అయ్యా యి. యాదాద్రి ఆలయానికే తలమానికంగా నిలిచిన స్వామివారి సప్తతల రాజగోపురం కలశ స్థాపనకు సోమవారం శ్రీకారంచుట్టారు. ఆలయ ఈవో గీత, ఆనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, అర్చకులు.. ప్రధానాలయం మాఢ వీధుల్లో దారు పూజలు నిర్వహించారు. కలశం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్కాఫోల్డింగ్ నిర్మాణానికి పూజలు చేసి, పనులు ప్రారంభించారు. పాతగుట్ట (పూర్వగిరి) నారసింహస్వామి తూర్పు రాజగోపురం నిర్మాణానికి పూజలు నిర్వహించారు. పీఆర్సీ పెంచిన నేపథ్యంలో దేవస్థానం సిబ్బంది తమ నెల వేతనం కలిపి మొత్తం రూ.30 లక్షలతో తూర్పు గోపురం నిర్మాణానికి ముందుకొచ్చారు.