హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 7 : కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్‌లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు వచ్చాయి. దీంతో హాస్టల్ డైరెక్టర్‌ను తొలగించాలని మెస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. పురుగులు రావడమేంటని అడిగితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని సిబ్బంది చెప్తున్నారని వాపోయారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో హాస్టల్ డైరెక్టర్ నాణ్యమైన టిఫిన్, భోజనం అందించడంలేదని ఆరోపించారు. నాసిరకం భోజనం, ఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ, రిజిస్ట్రార్ దృష్టిసారించాలని కోరారు.
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ మం డిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల లంబాడీల భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నుపడిందని, బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఏ ఒకరోజు గిరిజనులు, లంబాడీల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదని పేర్కొన్నారు. గిరిజన యువతి, యువకులకు మం జూరైన రుణాలను ఇప్పటికీ విడుదల చేయలేదని వాపోయారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్టీలకు ఇచ్చిన హామీని అమ లు చేయడంతో సీఎం విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పకతప్పదని ఆయన హెచ్చరించారు.