మహ్మదాబాద్, ఏప్రిల్ 4: సన్న బి య్యం పంపిణీ చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటున్నాయి. కానీ రేషన్ దుకాణాలకు అందించే బియ్యం ముక్కిపోయి ఉంటున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా చౌదర్పల్లి రేషన్ షాపునకు 220 క్వింటాళ్ల బియ్యం స్టాక్ రాగా, శనివారం పంపిణీ చేయడానికి సం చులు తెరువగా నూకలు.. పురుగులు కనిపించడంతో లబ్ధిదారులు కంగుతిన్నారు. మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఎలా తినాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.