Beer Bottle | కోనరావుపేట, జూలై 14: బీరు సీసాల్లో పురుగులు, చెత్తాచెదారం రావడంతో మద్యం ప్రియులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్లో వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్లో నాలుగు బీర్లు కొనుగోలు చేశారు.
వాటిలో రెండు బీరు సీసాల్లో పురుగులు, చెత్తాచెదారం కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నాణ్యత లేని బీర్లు సరఫరా చేస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్సెట్ వెబ్ ఆప్షన్ల గడవు సోమవారంతో ముగియనుంది. కౌన్సెలింగ్కు హాజరైన వారు సోమవారం వరకు వెబ్ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇప్పటివరకు 99,170 మంది అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్కు హాజరుకాగా, 90వేలకు పైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. 19లోపు సీట్లను కేటాయిస్తారు. 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 70,307, మేనేజ్మెంట్ కోటాలో మరో 27,989 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లల్లో 41,968 సీట్లు (59. 69శాతం) సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉన్నాయి.