కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్‌లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చిన విషయం తెలిసిందే. మెస్‌లో నాణ్యమైన భోజనం అందించడంలేదని, ఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. -హనుమకొండ చౌరస్తా