హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాదంగా మారాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం మగ్దూంభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐకి ఓ సీటు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు.
త్వరలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ?
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పోలీసు కమిషనర్లు, కలెక్టర్లతోపాటు మరికొందరికి స్థానచలనం కల్పించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. కోడ్ ముగియనుండడంతో బదిలీలకు క్లియర్ కానున్నది.