మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 18: కేసీఆర్ ప్రభుత్వంలో కులవృత్తులకు అత్యంత ప్రాధాన్యత కల్పించి.. అండగా నిలిచామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ చౌరస్తాలో మేదరి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.