లోతైన విశ్లేషణతో వార్తలివ్వాలి
వాతావరణ మార్పులకు సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు జర్నలిస్టులు వాస్తవ సమాచారాన్ని గణాంకాలతోపాటు లోతైన విశ్లేషణ, పరిశోధనాత్మక కథనాలను అందించాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, యాక్టింగ్ పబ్లిక్ అఫైర్స్ అధికారి జోనాథన్ ఓర్ సూచించారు.
- యూఎస్ కాన్సులేట్ అధికారి జోనాథన్ ఓర్ సూచన
- వాతావరణ మార్పులపై తెలుగు జర్నలిస్టులకు వర్క్‌షాప్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులకు సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు జర్నలిస్టులు వాస్తవ సమాచారాన్ని గణాంకాలతోపాటు లోతైన విశ్లేషణ, పరిశోధనాత్మక కథనాలను అందించాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, యాక్టింగ్ పబ్లిక్ అఫైర్స్ అధికారి జోనాథన్ ఓర్ సూచించారు. వ్యూస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి యూఎస్ కాన్సులేట్ తెలుగు జర్నలిస్టులకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించింది. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ జోనాథన్ ప్రసంగించారు. వాతావరణ మార్పులను రిపోర్ట్ చేయటానికి అవసరమైన సాధనాలు, సాంకేతికతను అందించటమే ఈ వర్క్‌షాప్ లక్ష్యమని చెప్పారు. వ్యూస్ ఇండియా డైరెక్టర్ ఎస్ భీమ్రావ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ భాగస్వామి కావటం సంతోషంగా ఉన్నదన్నారు. వాతావరణ వార్తల కవరేజీని పెంచటానికి మీడియా సంస్థలకు ఇలాంటి వర్క్‌షాప్‌లు సహాయపడతాయని చెప్పారు. ఈ సదస్సులో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ వాణీప్రసాద్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

