హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీసు అకాడమీలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు ఉన్నతాధికారులకు గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా ముఖ్యఅతిథిగా హాజరై కొత్త చట్టాలపై రూపొందించిన ‘న్యూ క్రిమినల్ లా బుక్స్’ ‘రెడీ రికనర్ ఆఫ్ న్యూ లాస్’ ‘న్యూ క్రిమినల్ లాస్’ అనే యాప్‌లను ఆవిష్కరించారు. కొత్త చట్టాలపై క్రిమినల్ లాయర్ ఏపీ సురేశ్ అవగాహన కల్పించారు. అనంతరం అధికారులను బృందాలుగా విభజించి ఇంటరాక్టివ్ చర్చలు జరిపారు.కార్యక్రమం లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జితేందర్, పోలీసు అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాషబిష్త్, ఏడీజీలు శిఖాగోయెల్, సంజయ్‌కుమార్ జైన్, విజయ్‌కుమార్, మహేశ్‌భగవత్, సీపీలు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, తరుణ్‌జోషి, అవినాశ్ మహంతి పాల్గొన్నారు.