హైదరాబాద్, ఏప్రిల్ 13: ‘ప్రభుత్వ బిల్లులపై నిర్ణయానికి సుప్రీంకోర్టు మూడు నెలల కాలపరిమితి విధిస్తూ ఆదేశాలివ్వడం హర్షణీయం.. ధర్మాసనం నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. నిర్దేశిత కాలపరిమితి లేకపోవడంతో గవర్నర్ వ్యవస్థను స్వా తంత్య్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దుర్వినియోగం చేశాయని విమర్శించారు. ఇదే తరహాలో స్పీకర్ నిర్ణయాధికారాలకు కాలపరిమితి విధించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు.