హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వరింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజే ఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. అధ్యక్షుడిగా రాణాప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా రావికంటి శ్రీనివాస్‌ను నియమించారు. పూర్తిస్థా యి రాష్ట్ర కమిటీని ప్రకటించే బాధ్యతను శ్రీనివాస్‌కి అప్పగిస్తూ తీర్మానం చేశారు.
దీంతో డబ్ల్యూజే ఐ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా వల్లీశ్వర్, సలహాదారులుగా ఎస్బీ రవీంద్రరాజు వర్మ, డాక్టర్ పీ మురళీమనోహర్, నందనం కృపాకర్, ఉపాధ్యక్షులుగా ఆవునూరి సాయికృష్ణ, సతీశ్‌కుమార్, బీరప్ప, దేవిక, ఎన్ అనిల్‌రావు, వీ ఎం ప్రసాద్, కార్యదర్శులుగా చింతల క్రాంతి ముదిరాజ్, నారాయణ్ (జర్నలిస్ట్ సిద్ధు), ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ చంద్రన్న, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివాజీ, కోశాధికారిగా హనుమాన్, కార్యాలయ కార్యదర్శిగా ప్రసాద్, లీగల్ సెల్ బాధ్యులుగా ఎన్ రామచంద్రరావు, ఎడ్ల రవి, టెక్నికల్ సెల్ సభ్యులుగా శ్రీకాంత్‌ను నియమించినట్టు రావికంటి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కమిటీ నియామకానికి సహకరించిన జాతీయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు.