ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 15 : పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మె సోమవారం నాలుగో రోజుకు చేరింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏఎన్ఎంలు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దీన్ని తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఎన్ఎంలు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసినపనిని 14 యాప్ల ద్వారా అప్డేట్ చేయాల్సి వస్తున్నదని చెప్పారు.