వెంకటాపూర్, డిసెంబర్ 24: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలోగల కామేశ్వరాలయ పునర్నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ కోసం పనులు ప్రారంభించారు. కామేశ్వరాలయం పునర్నిర్మాణంతోపాటు, ప్రసాద్ ప్రాజెక్ట్ పనుల కోసం 2022లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కామేశ్వరాలయ పునర్నిర్మాణం కోసం రూ.11 కోట్ల నిధులు కేటాయించారు. గత వేసవిలో పూర్తిగా కామేశ్వరాలయ రాళ్లను, ఇసుకను తొలగించగా వర్షాకాలంలో పనులు నిలిచిపోయాయి. మంగళవారం ప్లేట్ లోడ్ టెస్ట్ కోసం ఏర్పాట్లు చేశారు.