హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): అర్థబలం, అంగబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని, దానిని అధిగమిస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం తెలిపారు. విజయవాడలోని మహాసభ ప్రాంగణంలో ఆయన మాట్లా డుతూ జాతి వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అమ లు చేసున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు వామపక్షాలతో కలిసి ప్రజాతంత్ర, లౌకిక పార్టీల ఐక్యతకు కృషి చేయాలని సభల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు.