Drinking Water | నిజాంపేట, మార్చి 10: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసులు సమీప వ్యవసాయ పొలం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. సర్పంచుల పదవీ కాలం ఉన్నంత వరకు ఎలాంటి నీటి సమస్య లేదని, ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నీటి సమస్య ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.