KTR | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తె లంగాణ) : ‘మహాలక్ష్మి’ పేరిట ఆర్టీసీ బ స్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టనున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తె లంగాణ): రాష్ట్ర మహిళా కమిషన్ తీరు హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ నేత రజితారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరిస్తున్నామని రాష్ట్ర మ హిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్‌వేదికగా పేర్కొనటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు, పోలీస్‌స్టేషన్‌లో ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్ర యోగించినపుడు, బాలికల వసతి గృహా ల్లో పరిణామాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, డిప్యూటీ సీఎం అనుచిత వ్యాఖ్య లు చేసినప్పుడు స్పందించని కమిషన్ కేటీఆర్‌కు నోటీసులు పంపటం ఏమిటో అర్థం కావడంలేదని అన్నారు.