హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని డీజీపీ సీవీ ఆ నంద్‌కు రాసిన లేఖలో తెలంగాణ మహిళా, ట్రాన్స్‌జెండర్స్ సంఘాల జేఏసీ కోరింది. అతనికి అసాధారణమైన ఉదారత, ప్రత్యేక ప్రాధాన్యాన్ని తెలంగాణ పోలీసులు ఇస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిందని పేర్కొన్నది. బలవంతులు, బలహీనులకు చట్టం వేర్వేరుగా వర్తించదని గుర్తుచేసింది. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి రక్షణ, గోప్యత, కౌన్సెలింగ్ తక్షణమే అందించాలని, బాలిక చిత్రాలు/వీడియోలను బయటపెట్టిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాలికను లైంగికంగా వశపరచుకోవడం, బలవంతం చేయడం, లైంగికంగా దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు భగీరథ్‌పై వచ్చాయని తెలిపారు. బాధితురాలి ఫొటో లు, వీడియోలను సోషల్ మీడియా లో లీక్ చేయడం తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తున్నదని లేఖలో తెలిపారు.
భగీరథ్‌పై పోక్సో కేసు వివరాలు విస్తృతంగా వార్తల్లో నిలిచినా, నిందితుడు పోలీసుల లుకౌట్ నోటీసులను పట్టించుకోకుండా లొంగిపోడానికి స మయం కావాలని లేఖలు పంపడం పోలీస్ శాఖకే అవమానమని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోలీసుల జాప్యంతో న్యాయవ్యవస్థ నిష్పక్షపా త, విశ్వసనీయతపై ప్రజల నమ్మకా న్ని దెబ్బతీసేలా ఉన్నదని చెప్పారు. భగీరథ్ హిం సాత్మక ప్రవర్తనపై గతంలోనే వీడియోలు బయటకొచ్చాయని పేర్కొన్నారు. దర్యాప్తు పర్యవేక్షణాధికారిని నియమించడం సముచితమే అయి నా కేసు దర్యాప్తును జాప్యం చేయడానికి, నిందితుడిని తప్పించడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి వీలు కల్పించే యంత్రాంగంగా మారకూడదని కోరారు.