హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ): పశు సంవర్ధక- పౌల్ట్రీ రంగాల్లో మహిళలు రాణించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎంఏఎఫ్ఎస్ యూ)-నాగ్పూర్, ‘పౌల్ట్రీ ఇండి యా’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెట్ కన్వర్జెన్స్-2026’ రెండో విడత వైస్ చాన్స్లర్ల సదస్సు ఆదివారం హైదరాబాద్లో ముగిసింది. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ వెటర్నరీ విద్య, పరిశోధనలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.
అనంతరం ‘18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026’ పోస్టర్ను ఆవిషరించారు. కార్యక్రమంలో వివిధ వెటర్నరీ యూనివర్సిటీలకు చెందిన 30 మందికిపైగా వైస్ చాన్స్లర్లు, శాస్త్రవేత్తలు, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్సింగ్ బయాస్, ట్రెజరర్ ఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.