హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, శ్రేయస్సును పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్… మై చాయిసెస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్), ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోలతో గురువారం చేతులు కలిపింది.
ఇప్పటికే ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సమర్థంగా కృషి చేస్తున్నట్టు ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ గొప్ప ఎన్జీవోలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.