Congress MLAs : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడుగడుగునా ఎండగడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే చాలు ఇదేనా అభివృద్ధి? హామీల అమలు ఎప్పుడు? అని నిలదీస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్(Murali Naik)కు నిరసన సెగ తగిలింది. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తువస్తామా? అని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే మురళీ నాయక్ వెళ్లారు. రెండేళ్లుగా తమను పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులంటూ రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ‘రెండు సంవత్సరాల నుండి మేము గుర్తుకురాలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరికి వస్తారా’ అంటూ ఎమ్మెల్యేపై మహిళలు విరుచుకుపడ్డారు. ఊహించని పరిణామంతో మురళీనాయక్, ఆయన అనుచరలు కంగుతిన్నారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తువస్తారా ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్
ఈ క్రమంలో రెండు సంవత్సరాల నుండి మేము గుర్తుకురాలేదు కానీ… https://t.co/CprEjjh1Ih pic.twitter.com/1D2U6iEKPk
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
వర్ధన్నపేటలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(KR Nagaraju)కు నిరసన సెగ తప్పలేదు. సోమవారం ఇందిరా మహిళ శక్తి సంబురాల్లో పాల్గొన్న ఆయనను నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు? అని మహిళలు ప్రశ్నించారు. చెరువులో నీళ్లు ఉండట్లేదని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని మహిళల ఆందోళన చేపట్టారు.
వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిరసన సెగ
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఇందిరా మహిళ శక్తి సంబురాల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజు
ఈ క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కేఆర్ నాగరాజుపై మండిపడ్డ మహిళలు
చెరువులో నీళ్లు ఉండట్లేదని, ఇందిరమ్మ… pic.twitter.com/LEmhhUx92e
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026