లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలం మాణిక్యపురం, జీడికల్ గ్రామాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మహిళలు నిలదీశారు. సోమవారం మండలంలోని మాణిక్యపురం,కళ్లెం, సిరిపురం, జీడికల్, గుమ్మడవెల్లి, నవాబుపేట, కుందారం, నెల్లుట్ల, లింగాల గణపురంలో సోమవారం సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారంలో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీడికల్లో మాట్లాడుతూ ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లకు ఉచితంగా కరెంటు, మహిళలకు ఉచిత బస్సు పథకాలను ప్రారంభించింది అన్నారు. గత ప్రభుత్వం దసరా చీరలను సరఫరా చేసేవారని అవి నాణ్యత లేకపోవడంతో మహిళలు ఆ చీరలను వ్యవసాయ బాల వద్ద పిట్టలు పక్షులు వాలకుండా చీరలను రక్షణగా కట్టే వారన్నారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి పట్టు చీరలను పోలే నాణ్యమైన చీరలను ఇందిరమ్మ పథకంలో అందిస్తుందని అనగానే జీడికల్లులో మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. మహిళా గ్రూపులో ఉన్న వారికి మాత్రమే చీరలు చీరలు అందాయని, సగం మందికి అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సగం మందికి రుణమాఫీ జరగలేదని ఆరోపంచారు. అలాగే మాణిక్యపురంలో ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రస్తావించిన సందర్భంలో ఓ మహిళ ఇంతవరకు బిల్లులు రాలేదని కడియంకు తెలపగా అక్కడ కూడా అదే విధంగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించండి సమస్యలు తీరుస్తానని సమాధానాన్ని దాటవేసి వెళ్లిపోయారు.