మున్సిపల్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : శ్రీదేవి
మున్సిపల్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీ కే శ్రీదేవి తెలిపారు. గురువారం పురపాలక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రీజియన్‌కు చెందిన మహిళా మేయర్లు, చైర్పర్సన్లకు హైదరాబాద్‌లో శిక్షణ శిబిరం నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీ కే శ్రీదేవి తెలిపారు. గురువారం పురపాలక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రీజియన్‌కు చెందిన మహిళా మేయర్లు, చైర్పర్సన్లకు హైదరాబాద్‌లో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీకే శ్రీదేవి కీలక సూచనలు చేశారు. పట్టణాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో నాయకత్వ నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఆర్థిక స్వావలంభన సాధించాలని, అవసరమైన చోటే నిధులు వెచ్చించాలని వారికి హితబోధ చేశారు. మున్సిపల్ చట్టం నిర్దేశించిన బాధ్యతలు, చట్టం, కేంద్ర-రాష్ట్ర పథకాల అమలు, నిధుల వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ శిబిరంలో 50మందికిపైగా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ రీజియన్‌కు చెందిన మహిళా ప్రజాప్రతినిధులకు నేడు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

