సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 16:24:06

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మెదక్‌ : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మహిళలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను ఇప్పిస్తానని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేట రామాయంపేట మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో గత మూడు నెలలుగా ఉషా ఫౌండేషన్‌ ఫౌండర్‌ కల్పన అధ్వర్యంలో కుట్టుశిక్షణ కార్య క్రమంలో పాల్గొని శిక్షణ పూర్తైన శిక్షకులకు సబ్సీడీపై కుట్టుమిషన్లను, క్రిస్మస్‌ పండుగ సందర్భంగా కానుకలను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ ద్వారా కుట్లు అల్లికలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. ప్రభుత్వం కూడా మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలను అందజేస్తుందన్నారు. అనంతరం కోనాపూర్‌ గ్రామంలో క్రిస్‌మస్‌ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.