హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : సమాజంలో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఐఏఎస్‌లు కూడా లైంగిక అసమానతలు ఎదుర్కొంటూనే ఉన్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాపోయారు. శుక్రవారం యూసఫ్‌గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్‌షాపులో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగా ల్లో సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళల పట్లసమాజంలో చిన్నచూపు పోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతివెస్లీ, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.