హైదరాబాద్: ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. ఇందిరమ్మ పాలనగా పోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా?, రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకు? అని ఎక్స్ వేదికగా నిలదీశారు.
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. వెంటనే కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేయాని, వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
రుణమాఫీకి సంబంధించి సీఎం సొంత గ్రామంలో వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని కొందరు యువకులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న వైక్లను గుంజుకున్నారు.
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం
ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? రుణమాఫీ సరిగా జరిగి…
— KTR (@KTRBRS) August 22, 2024
సీఎం సొంత గ్రామంలో వార్తలు కవర్ చేసే స్వేచ్ఛ మన తెలంగాణ మహిళా జర్నలిస్టులకు లేకుండా పోయింది
ఇది ప్రజాపాలన కాదు నియంత పాలన pic.twitter.com/BOEs5pJhsI
— KTR News (@KTR_News) August 22, 2024