మానకొండూర్ రూరల్, జనవరి 5 : కాంగ్రెస్లో మహిళలకు గౌరవం లేదని, జిల్లా కమిటీలో ఉన్నా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇదేం తీరు అని మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం మానకొండూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల కవిత పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో తనకు అవమానం జరిగిందని, ఈ విషయమై ఏ ఒక్కరూ స్పందించలేదని ఎమ్మెల్యే ముందే ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారు మహిళలను విస్మరించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.