Free Bus | ఆత్మకూరు, ఏప్రిల్ 1: ఉచిత బస్సు ప్రయాణం తమకొద్దంటూ మహిళలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే తీసేయాలని మహిళలు వేడుకున్నారు. కంగుతున్న ఎమ్మెల్యే.. ఎందుకు తీసేయాలని ఆరా తీయగా.. ప్రభుత్వం బస్సు చార్జీలు తీసుకుంటేనే తమకు గౌరవం దక్కుతుందని, ఉచితంగా ప్రయాణిస్తున్నామని ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుండటం తమను బాధిస్తున్నదని చెప్పారు.
ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పా రు. అవసరమైతే డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించి గౌరవం దక్కేలా చూస్తానని సర్దిచెప్పారు. ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, పథకాలు పూర్తిగా అందించలేక పోతున్నామని ఆయన స్పష్టంచేశారు.