మందమర్రిరూరల్, జూన్ 27 : డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి పేరు తొలగించడంతో ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ సీసాతో ఆందోళన వ్యక్తం చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూరెల్లి లక్ష్మి పేరు డబుల్ బెడ్ రూం ఇండ్ల జాబితాలో వచ్చింది. ఆపై తన పేరు తొలగించారని ఆరోపిస్తూ పెట్రోల్ సీసాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. తనకు డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించగా, అర్హత ఉంటే మంజూరవుతుందని తహసీల్దార్ సమాధానం ఇచ్చాడు. ఆపై ఆమె పెట్రోల్ పైన పోసుకుని ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్యచేసుకుంటానని తె లిపింది. అక్కడున్న కార్యాలయం సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు ఆమెను సముదాయించి ఇంటికి పంపించారు.
రుణమాఫీ కాలేదని.. యువ రైతు ఆత్మహత్య ; ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఘటన
తాంసి, జూన్ 27 : రుణమాఫీ కాలేదని పురుగులమందు తాగి యు వ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో జరిగింది. శుక్రవారం జామిడి గ్రామానికి చెందిన మునేశ్వర్ అరుణ్(32)కు రెండెకరా లు, తండ్రి సుదర్శన్ పేరుమీద 4 ఎకరాలు, సోదరుడు కిరణ్ పేరుమీద 2 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నది. జామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అరుణ్ పంట రుణం రూ.80 వేలు తీసుకున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో వీరందరిపేరుపై రూ.2.30 లక్షల రుణం ఉండడంతో రుణమాఫీకాలేదు. దీంతో ఆవేదన గురైన అరు ణ్ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తాంసి ఇన్చార్జి ఎస్ఐ ప్రణయ్ తెలిపారు.