చౌటకూర్, జూన్ 27: మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కన్న కూతురుపై లైంగికదాడికి యత్నించగా.. కట్టుకున్న భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో జరిగింది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నె మాణయ్య (50) బుధవారం రాత్రి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించగా.. భార్య ఇందిర అతడిని గొడ్డలితో నరికి చంపింది. మాణయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. కుమారుడు ప్రవీణ్ నిరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పుల్కల్ ఎస్సై శ్రీకాంత్ విచారణ చేపట్టారు.
బాలికపై కానిస్టేబుల్ లైంగికదాడి
బండ్లగూడ,జూన్ 27: బాలికపై పోలీ స్ కానిస్టేబుల్ లైంగికదాడి చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకా రం బుద్వేల్‌లో ఉండే గాజుల ప్రదీప్ ఆ ర్జీఐ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చర్చికి వచ్చే ఓ బాలిక ను నమ్మించి నాలుగేండ్లుగా పలుమార్లు లైంగికదాడి చేశాడు. సదరు బాలిక తన ను వివాహం చేసుకోవాలని నిలదీయడంతో ఏడాది క్రితం పెండ్లి అయినట్టు చెప్పాడు. బాలిక తల్లితో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాగొస్తున్నాడని భర్తకు వాతలు
వినాయక నగర్, జూన్ 27: ప్రతి రోజూ మద్యం తాగి వస్తున్నాడని నిద్రలో ఉన్న భర్తకు వాతలు పెట్టిందో భార్య. నిజామాబాద్ శివారులోని సారంగపూర్‌కు చెందిన మహేశ్,సుమలత దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు. ప్లంబర్‌గా పని చేసే మహేశ్ నాలుగు రోజుల క్రితం పనికి వెళ్లి వచ్చి రాత్రి నిద్రకుపక్రమించాడు. ఆ సమయంలో సుమలత అతడి కాళ్లు, చేతులు కట్టేసి, ఇనుపరాడ్డు కాల్చి కాళ్లు, చేతులు, ముఖంపై వాతలు పెట్టింది. మహేశ్ గట్టిగా అరవడంతో పిల్లలను తీసుకుని పారిపోయింది. తర్వాతి రోజు బాధితుడు ఆరో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.