లింగాలఘనపురం, అక్టోబర్ 11 : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అం దక పోవడం.. అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో గర్భిణి ఆటోలోనే ప్రసవించిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన మరికుక్కల కనకమహాలక్ష్మి నిండు గర్భిణి. శనివారం పురిటి నొప్పులు రావడంతో కనకమహాలక్ష్మిని భర్త ఉపేందర్ లింగాలఘనపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లా డు. వైద్యులు, సిబ్బంది లేకపోవడం.. పురిటినొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్సు కు సమాచారం ఇచ్చారు. ఆ వాహనం అం దుబాటులో లేకపోవడంతో ఆటోలో జనగామకు తీసుకెళ్తుండగా ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న నెల్లుట్ల ఆశ కార్యకర్త ఆటో వద్దకు చేరుకుని తల్లీ బిడ్డలను జనగామ చంపక్హిల్స్లోని దవాఖానాకు తరలించారు.